షాడో డైరెక్ట‌ర్ ఫిక్స్‌..?

ABN , First Publish Date - 2020-06-28T14:30:18+05:30 IST

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ షాడో న‌వ‌ల‌ను వెబ్ సిరీస్ రూపంలో రూపొందించనుంది.

షాడో డైరెక్ట‌ర్ ఫిక్స్‌..?

తెలుగు సాహిత్యంలో న‌వ‌ల‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఎన్నో న‌వ‌ల‌లు సినిమాల రూపంలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి కూడా. న‌వ‌లా సాహిత్యంలో మ‌ధుబాబు ర‌చ‌న‌ల‌కు మంచి గుర్తింపు ఉంది. ఆయ‌న ర‌చించిన నవ‌లల్లో షాడో న‌వ‌లకు అభిమానులెంద‌రో. ఇప్పుడు ఆ న‌వ‌ల దృశ్య రూపంలో ఆవిష్కృతం కానుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ షాడో న‌వ‌ల‌ను వెబ్ సిరీస్ రూపంలో రూపొందించనుంది.  ‘రాజా చెయ్యి వేస్తే’ అనే సినిమాను తెరకెక్కించిన డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కిస్తాడ‌ని సినీ వ‌ర్గాల్లో స‌మాచారం. ఓ ప్రముఖ హీరోను నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానుంది. 

Updated Date - 2020-06-28T14:30:18+05:30 IST