సెంటిమెంట్ ప‌క్క‌న పెట్టిన ప్ర‌భాస్‌

ABN , First Publish Date - 2020-02-02T21:59:05+05:30 IST

'రెబల్ స్టార్'.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరుకున్న పవర్ అంతా ఇంతా కాదు. ఈ టైటిల్ తో అప్పటి ప్రేక్షకులను కృష్ణంరాజు ఆకట్టుకోగా, ఇప్పుడు ఆయన

సెంటిమెంట్ ప‌క్క‌న పెట్టిన ప్ర‌భాస్‌

'రెబల్ స్టార్'.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరుకున్న పవర్ అంతా ఇంతా కాదు. ఈ టైటిల్ తో అప్పటి ప్రేక్షకులను కృష్ణంరాజు ఆకట్టుకోగా, ఇప్పుడు ఆయన వారసుడు ప్రభాస్ రెబల్ స్టార్ గా వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. 'బాహుబలి' సీరిస్ సినిమాలతో ఈ 'సాహో' స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం తాను చేస్తున్న కొత్త మూవీ కోసం 'డార్లింగ్' బ్యాడ్ సెంటిమెంట్ ని పక్కన పెట్టినట్టు సమాచారం.

 

ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌తో కలసి గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ క్యారెక్టర్ కోసం ప్రభాస్.., తన పెదనాన్నను ఎంతో కష్టపడి ఒప్పించాడట. రెబల్ స్టార్స్ అభిమానుల ముచ్చట తీర్చడం కోసమే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

గతంలో కృష్ణంరాజు - ప్రభాస్ కలసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేదు. ‘బిల్లా’, ‘రెబల్’ సినిమాలలో కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించారు. వీటిలో 'బిల్లా' యావరేజ్ టాక్ దక్కించుకోగా, 'రెబల్' మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో కృష్ణంరాజు- ప్రభాస్ కలసి నటిస్తే సినిమా ఫ్లాప్ అవుతుందన్న బ్యాడ్ సెంటిమెంట్ పడిపోయింది. అయితే ఈ కొత్త సినిమా విషయంలో సీనియర్ రెబల్ స్టార్ ని ఏరికోరి నటింపచేస్తున్నాడట ప్రభాస్. మరి రెబల్ స్టార్స్ కాంబినేషన్ ఈ సారైనా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

Updated Date - 2020-02-02T21:59:05+05:30 IST