షాకింగ్: ప్రభాస్ పారితోషికం ఎంతో తెలుసా?

ABN , First Publish Date - 2020-03-04T18:01:00+05:30 IST

`బాహుబలి` సినిమాతో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.

షాకింగ్: ప్రభాస్ పారితోషికం ఎంతో తెలుసా?

`బాహుబలి` సినిమాతో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రభాస్ సినిమాలకు దక్షిణాదితోపాటు ఉత్తరాదిన కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమాలను నిర్మించేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు రాధాకృష్ణ రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ఆ తర్వాత వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కే సినిమాను పట్టాలెక్కించనున్నాడు. 


సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. ఈ చిత్ర యూనిట్ ప్రభాస్‌కు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసిందట. ఈ సినిమా పారితోషికంగా ప్రభాస్ దాదాపు 70 కోట్ల రూపాయలు ప్లస్ లాభాల్లో వాటా తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్ భామ దీపికా పదుకొణేను హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-03-04T18:01:00+05:30 IST

Read more