నాని పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్‌..!

ABN , First Publish Date - 2020-06-28T16:31:28+05:30 IST

క‌రోనా దెబ్బ‌కు ఆగిపోయిన సినిమాల్లో నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందిన ‘వి’ సినిమా కూడా ఉంది.

నాని పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్‌..!

క‌రోనా దెబ్బ‌కు ఆగిపోయిన సినిమాల్లో నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందిన ‘వి’ సినిమా కూడా ఉంది. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయ్యింది. థియేట‌ర్స్ ఓపెన్ అయిన త‌ర్వాత ముందుగా విడుద‌లయ్యే ఈ సినిమాల్లో ‘వి’ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తే ఇందులో నాని విల‌న్‌గా, సుధీర్‌బాబు హీరోగా క‌నిపిస్తున్నారు. త‌న 25వ చిత్రంలో నాని విల‌న్‌గా క‌నిపిస్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌మోష‌న్‌లో అలాగే హైలెట్ చేస్తూ వ‌చ్చారు. అయితే సినీ వర్గాల తాజా సమాచారం మేరకు ‘వి’ చిత్రంలో నానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంద‌ట‌. అందులో ఆయ‌న ఆర్మీ మేజ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారట. ఈ చిత్రంలో నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్స్‌గా న‌టించారు. 

Updated Date - 2020-06-28T16:31:28+05:30 IST