పవర్‌స్టార్ జతగా...?
ABN , First Publish Date - 2020-08-25T19:20:58+05:30 IST
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. అంతే అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే మహేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్స్‌తో నటించిన పూజా హెగ్డే, పవన్‌కల్యాణ్‌తోనూ వెండితెరపై సందడి చేస్తారు.