ఆ హీరో మంచోడంటున్న బుట్టబొమ్మ

ABN , First Publish Date - 2020-02-16T03:13:47+05:30 IST

బుట్టబొమ్మ ఇంకెవరు... పూజా హెగ్డేనే. పూజా మంచివాడంటున్న ఆయన దక్షిణాదికి చెందిన హీరో కాదు. బాలీవుడ్‌ హీరో రణబీర్‌ గురించే ఆ కాంప్లిమెంట్‌ ఇచ్చింది

ఆ హీరో మంచోడంటున్న బుట్టబొమ్మ

బుట్టబొమ్మ ఇంకెవరు... పూజా హెగ్డేనే. పూజా మంచివాడంటున్న ఆయన దక్షిణాదికి చెందిన హీరో కాదు. బాలీవుడ్‌ హీరో రణబీర్‌ గురించే ఆ కాంప్లిమెంట్‌ ఇచ్చింది పూజా. రణబీర్‌ మంచితనం తన కెరీర్‌ తొలినాళ్ళల్లో తెలిసి వచ్చిందట. రణబీర్‌తో కలిసి ఓ యాడ్‌ ఫిలిమ్‌లో నటించాల్సి వచ్చిందట! అప్పటికే హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రణబీర్‌ను చూసి పూజాకి భయమేసిందట. ఆ భయంతో సరిగ్గా చేయలేకపోయేదట. సరిగ్గా చేయలేకపోయిన ప్రతిసారీ రణబీర్‌కు సారీ చెప్పేదట. అన్ని సారీలు విన్న తరువాత రణబీర్‌కు విసుగొచ్చి సారీలు చెప్పొద్దు అన్నాడట. రణబీర్‌ అలా అనడంతో భయం పోయి ధైర్యంగా చేసిందట. అందుకే రణబీర్‌ మంచోడు అంటూ బిరుదు ఇస్తోంది.

Updated Date - 2020-02-16T03:13:47+05:30 IST