బుట్ట‌బొమ్మ డేటింగ్ చేస్తోందా..?

ABN , First Publish Date - 2020-04-06T13:54:13+05:30 IST

లేటెస్ట్‌గా పూజా హెగ్డే డేటింగ్ చేస్తోంద‌ని సినీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.

బుట్ట‌బొమ్మ డేటింగ్ చేస్తోందా..?

ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్‌లో పూజా హెగ్డే ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 20వ చిత్రంలో న‌టిస్తుంది. దీని త‌ర్వాత బాలీవుడ్‌లో అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న న‌టిస్తుంది. అంతా కుదిరితే ఈ ఏడాది కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తాన‌ని అంటోంది పూజా హెగ్డే. లేటెస్ట్‌గా ఈ అమ్మ‌డు డేటింగ్ చేస్తోంద‌ని సినీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే సీనియ‌ర్ న‌టుడు వినోద్ మెహ్రా త‌న‌యుడు రోహ‌న్ మెహ్రాతో పూజా హెగ్డే డేటింగ్ చేస్తుందనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై రోహ‌న్ మెహ్రా కానీ.. ఇటు మ‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కానీ నోరు విప్ప‌డం లేదు.

Updated Date - 2020-04-06T13:54:13+05:30 IST