పాయల్.. ఇక పెళ్లేనా?

ABN , First Publish Date - 2020-02-26T19:52:00+05:30 IST

తొలి సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. హాట్ స‌న్నివేశాల్లో ఈజ్‌తో న‌టించి ఔరా అనిపించింది. మలి సినిమా

పాయల్.. ఇక పెళ్లేనా?

తొలి సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. హాట్ స‌న్నివేశాల్లో ఈజ్‌తో న‌టించి ఔరా అనిపించింది. మలి సినిమా ‘ఆర్‌డిఎక్స్ లవ్’ చిత్రంలోనూ అలివేలుగా న‌టించి శృంగార పాఠాలు నేర్పించిన పాయ‌ల్‌కు ఓ బాయ్ ఫ్రెండ్ వున్నాడ‌ట‌. అత‌నే త‌న జాన్ అంటూ ఏకంగా సోషల్ మీడియా వేదిక‌గా త‌న అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసి షాకిచ్చింది. పాయ‌ల్ బాయ్‌ఫ్రెండ్ పేరు సౌర‌భ్ డింగ్రా. అత‌ను ముంబైలో మోడ‌ల్‌. ఒకానొక సంద‌ర్భంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ట‌. ఇద్ద‌రూ గ‌త కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఒక‌రి లోపాల‌ని ఒక‌రు ఇష్ట‌ప‌డుతున్నారు. 


తాజాగా సౌర‌భ్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని ఇద్ద‌రి మ‌ధ్య వున్న అనుబంధాన్ని పాయ‌ల్ సోష‌ల్‌ మీడియా ట్విట్టర్ వేదిక‌గా బ‌య‌టిపెట్టింది. త‌న లోపాల‌ని ఇష్ట‌ప‌డే ఏకైక వ్య‌క్తి అంటూ త‌న ప్రియుడి పుట్టిన రోజు వేడుక‌ని త‌న అభిమానుల‌తో క‌లిసి పాయ‌ల్ జ‌రుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోల‌ని పాయ‌ల్ షేర్ చేసింది కూడా. ఆ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. పాయల్‌ , సౌరభ్‌లు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు కనుక ఇక పెళ్లే తరువాయి అంటున్నారు ఆమె అభిమానులు.

Updated Date - 2020-02-26T19:52:00+05:30 IST