ఆ రైటర్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

ABN , First Publish Date - 2020-12-01T13:08:02+05:30 IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా వరుస సినిమాలు చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న 'వకీల్‌సాబ్‌'ను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్‌.

ఆ రైటర్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా వరుస సినిమాలు చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న 'వకీల్‌సాబ్‌'ను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్‌. దీని తర్వాత క్రిష్‌ సినిమాతో పాటు మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' రీమేక్తో పాటు‌, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా,  సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇటీవల నిర్మాత బండ్లగణేశ్‌ మరోసారి పవన్‌తో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేయడానికి బండ్లగణేశ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ తమిళ రైటర్‌ చెప్పిన కథను రీసెంట్‌గా పవన్‌కు బండ్ల గణేశ్‌ వినిపించారని వార్తలు కూడా వచ్చాయి కూడా. అయితే లేటెస్ట్‌ సమాచారం మేరకు రైటర్‌ కోన వెంకట్‌ సిద్ధం చేసిన ఓ కథను పవన్‌కు వినిపించడానికి బండ్లగణేశ్‌ ఆసక్తిగా ఉన్నారట. మరి పవన్‌కు కథ నచ్చుతుందా? ఒకవేళ నచ్చితే.. ఈ బిజీ షెడ్యూల్‌లో బండ్ల సినిమాను ఎప్పుడు లైన్‌లో పెడతాడోనని అందరూ అనుకుంటున్నారు. 


Updated Date - 2020-12-01T13:08:02+05:30 IST

Read more