పవన్ నెల రోజులు అక్కడే ఉంటారా?

ABN , First Publish Date - 2020-10-14T15:10:34+05:30 IST

మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు.

పవన్ నెల రోజులు అక్కడే ఉంటారా?

మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం `వకీల్ సాబ్` చేస్తున్నారు. అలాగే డైరెక్టర్లు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేశారు. మలయాళ సినిమా `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌కు కూడా తాజాగా పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. 


ఈ సినిమా కోసం పవన్ కేవలం నెల రోజుల కాల్‌షీట్లు ఇస్తే చాలట. ఒకే షెడ్యూల్‌లో పొలాచ్చిలో షూటింగ్ చేసెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. అందువల్ల ఫిబ్రవరి నెలలో ఈ సినిమాకు కాల్‌షీట్లు కేటాయించాలని పవన్ అనుకుంటున్నారట. ఈలోగా `వకీల్ సాబ్` పూర్తి చేస్తారట. అలాగే, క్రిష్ సినిమాలోని ఓ కీలక ఎపిసోడ్ షూటింగ్‌ను కూడా పూర్తి చేస్తారట. ఆ తర్వాత `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌ను పట్టాలెక్కిస్తారట. ఈ మల్టీ స్టారర్ సినిమాలో పవన్‌తోపాటు రానా కూడా నటించబోతున్నాడట. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ రూపొందిస్తున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా తెలియలేదు. 

Updated Date - 2020-10-14T15:10:34+05:30 IST