ఇకపై పవన్ సినిమాల్లో ‘నో డ్యాన్స్, నో రొమాన్స్’!

ABN , First Publish Date - 2020-06-29T00:46:31+05:30 IST

పవన్ అభిమానులు డిజపాయింట్ అయ్యే ఓ గాసిప్… రైట్ నౌ, సినీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ...

ఇకపై పవన్ సినిమాల్లో ‘నో డ్యాన్స్, నో రొమాన్స్’!

పవన్ అభిమానులు డిజపాయింట్ అయ్యే ఓ గాసిప్… రైట్ నౌ, సినీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే జనసేనాని నటించబోయే మున్ముందు చిత్రాలలో డాన్సులు ఉండవట. డాన్స్ మూవ్మెంట్స్ అవసరం అయ్యే పాటలు ఇకపై వద్దని పవన్ నిర్ణయించాడట. ఇలా ఎందుకంటే, ఆయన రాజకీయ, సేవా కార్యక్రమాలలో తలమునకలవుతున్నారు. అందువల్ల వెండితెరపై పాటలు, డాన్సులు, రొమాన్స్ చేయటం కరెక్ట్ కాదని పవన్ భావించాడట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ‘విరూపాక్ష’లోనూ కేవలం రెండు పాటలే ఉంటాయంటున్నారు. అవి కూడా సిట్యుయేషనల్ పాటలు కావటం విశేషం. 


మొగల్‌రాజుల కాలంనాటి చారిత్రాత్మక కథను పవర్ స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా క్రిష్ మెరుగులు దిద్దాడట. హిస్టారికల్ మూవీ కావడంతో ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను, ఆ కాలపు నేటివిటీ కనిపించేలా తీర్చిదిద్దుతున్నట్టు చిత్ర వర్గాలలో టాక్. ఈ సినిమా పవన్ కళ్యాణ్  కెరీర్‌లో మైలురాయిగా మిగులుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తరువాత మరోసారి డైరెక్టర్ క్రిష్ చారిత్రాత్మక కథతో తీస్తోన్నఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టులో ప్రారంభం అవుతుందని సమాచారం. క్రిష్ మూవీ తక్కువ టైంలోనే పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ డ్యాన్సులు, రొమాన్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని క్రిష్ మూవీకి సంగీతం ఎంఎం కీరవాణి. మరి పవన్ ఆలోచనను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతవరకూ ఆదరిస్తారో చూద్దాం.

Updated Date - 2020-06-29T00:46:31+05:30 IST