మ‌రో మలయాళ రీమేక్‌లోప‌వ‌న్ క‌ల్యాణ్‌?

ABN , First Publish Date - 2020-05-13T14:58:43+05:30 IST

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రో మలయాళ రీమేక్‌లోప‌వ‌న్ క‌ల్యాణ్‌?

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ‘పింక్’ రీమేక్ ‘వ‌కీల్‌షాబ్‌’తోనే రీఎంట్రీనీ స్టార్ట్ చేసిన ప‌వ‌న్ వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రో రీమేక్‌లో న‌టించ‌బోతున్నార‌ని సోషల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల మేర‌కు మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను కొంద‌రు నిర్మాత‌లు చేజిక్కించుకున్నారని, అందులో హీరో పాత్ర‌కు ప‌వ‌న్ అయితే న్యాయం చేస్తార‌ని వారు భావిస్తున్నార‌ట‌. పవన్‌కల్యాణ్‌కి ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూపించాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

Updated Date - 2020-05-13T14:58:43+05:30 IST