పవన్ 30వ చిత్రం ఆ దర్శకుడితోనా..?

ABN , First Publish Date - 2020-08-19T05:26:39+05:30 IST

‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ 26వ చిత్రంగా ‘వకీల్‌సాబ్’, పవన్ 27వ చిత్రం క్రిష్‌తోనూ

పవన్ 30వ చిత్రం ఆ దర్శకుడితోనా..?

‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ 26వ చిత్రంగా ‘వకీల్‌సాబ్’, పవన్ 27వ చిత్రం క్రిష్‌తోనూ, పవన్ 28వ చిత్రం హరీష్ శంకర్‌తోనూ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయ్యాయి. ఈ మూడు కాకుండా ఇప్పుడు మరో రెండు చిత్రాలు పవన్ చేస్తున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. పవన్ 29వ చిత్రానికి ముగ్గురు డైరెక్టర్స్ పేర్లు వినబడుతుంటే.. పవన్ 30వ చిత్రానికి మెగాహీరో వరుణ్‌తేజ్‌తో పవన్ చిత్ర టైటిల్‌ ‘తొలిప్రేమ’ పెట్టి హిట్ కొట్టిన వెంకీ అట్లూరి పేరు వినబడుతుంది.


పవన్ 29వ చిత్ర విషయంలో సురేందర్ రెడ్డి, డాలీ, గోపీచంద్ మలినేని పేర్లు వినిపిస్తున్నాయి. మంచి కథతో ఈ ముగ్గురిలో ఎవరు వచ్చినా సినిమా చేయడానికి నిర్మాత రామ్ తాళ్లూరి రెడీగా ఉన్నట్లుగానూ, పవన్ దగ్గర అనుమతి తీసుకున్నట్లుగానూ వార్తలు వస్తున్నాయి. ఇక పవన్ 30 సినిమా విషయానికి వస్తే.. ఇది మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ అనే చిత్రానికి రీమేక్. ఈ చిత్ర రైట్స్ ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దగ్గర ఉన్నాయి. అల్రెడీ ఈ చిత్ర రీమేక్ గురించి ఇప్పటికే ఎందరో హీరోల పేర్లు వినిపించాయి. ఇటీవల ఈ సినిమా పవన్ చూశాడని, అతనికి నచ్చి రీమేక్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించాడని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి తెలుగు నెటివిటీకి సంబంధించిన మార్పులు కూడా జరిగాయని, పవన్ ఓకే అంటే సెట్ పైకి వెళ్లడమే తరువాయి అనేలా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మొదటి నుంచి ఈ సినిమాకు ఇద్దరు హీరోల పేర్లు వినిపించినట్లే.. ఇప్పుడు పవన్‌తో పాటు తమిళనటుడు విజయ్ సేతుపతి కూడా ఇందులో భాగం కాబోతోన్నట్లుగా టాక్ నడుస్తుంది. మరి నిజంగా వెంకీ అట్లూరికి ఈ చిత్రం రీమేక్ చేసే ఛాన్స్ వస్తే మాత్రం.. అతనికి అదృష్టం పట్టినట్లే అంటూ అప్పుడే వార్తలు మొదలయ్యాయి.

Updated Date - 2020-08-19T05:26:39+05:30 IST