పవన్ 27 హీరోయిన్ ఖ‌రారు?

ABN , First Publish Date - 2020-02-26T21:31:02+05:30 IST

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత `పింక్‌` రీమేక్ `వ‌కీల్‌సాబ్‌`(విన‌ప‌డుతున్న టైటిల్‌) సినిమాల్లో న‌టిస్తున్నారు.

పవన్ 27 హీరోయిన్ ఖ‌రారు?

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత `పింక్‌` రీమేక్ `వ‌కీల్‌సాబ్‌`(విన‌ప‌డుతున్న టైటిల్‌) సినిమాల్లో న‌టిస్తున్నారు. దీని త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడిక‌ల్ సినిమాలో న‌టించ‌బోతున్నార‌ని టాక్‌. ఈ చిత్రానికి ‘విరూపాక్ష‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ నటించ‌బోతున్నార‌ట‌. ప‌లువురు హీరోయిన్స్ పేర్ల‌ను ప‌రిశీలించిన మేక‌ర్స్ చివ‌ర‌కు కీర్తిసురేశ్‌నే ఎంపిక చేశార‌ట‌. ఇంత‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ‘అజ్ఞాత‌వాసి’ చిత్రంలో కీర్తిసురేశ్ న‌టించింది. 

Updated Date - 2020-02-26T21:31:02+05:30 IST