లెక్చరర్‌గా పవర్‌స్టార్‌..?

ABN , First Publish Date - 2020-09-28T19:41:38+05:30 IST

లాయర్‌ పాత్రలో కనిపిస్తోన్న పవన్‌ తదుపరి చేయబోయే హరీశ్‌ శంకర్‌ సినిమాలో లెక్చరర్‌ పాత్రలో కనిపిస్తారనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

లెక్చరర్‌గా పవర్‌స్టార్‌..?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ 'వకీల్‌సాబ్‌' సినిమా బాలీవుడ్‌ మూవీ 'పింక్‌'కు రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లాయర్‌ పాత్రలో కనిపిస్తోన్న పవన్‌ తదుపరి చేయబోయే హరీశ్‌ శంకర్‌ సినిమాలో లెక్చరర్‌ పాత్రలో కనిపిస్తారనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. గతంలో పవన్‌ను హరీశ్‌ శంకర్‌ పవర్‌ఫుల్ పోలీస ఆఫీసర్‌గా చూపించనున్నారనే టాక్‌ కూడా వినిపించింది. అయితే తాజాగా ఇప్పుడు పవన్‌ లెక్చరర్‌ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. మైత్రీమూవీమేకర్స్‌ బ్యానర్‌లో హరీశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. పవన్‌కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'గబ్బర్‌సింగ్‌' ఇండస్ట్రీ హిట్‌ సాధించిన నేపథ్యంలో వీరి కాంబోలో రాబోతున్న మరో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Updated Date - 2020-09-28T19:41:38+05:30 IST