పవన్-రానా సినిమా.. టైటిల్ అదేనా?

ABN , First Publish Date - 2020-12-22T17:59:50+05:30 IST

టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కబోతోంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి హీరో రానా తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు

పవన్-రానా సినిమా.. టైటిల్ అదేనా?

టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కబోతోంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి హీరో రానా తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియం` రీమేక్‌లో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. 


ఈ సినిమాకు `బిల్లా-రంగా` అనే టైటిల్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఇదే సరైన టైటిల్ అని చిత్రయూనిట్ భావిస్తోందట. గతంలో ఇదే టైటిల్‌తో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన సంగతి తెలిసిందే. పవన్ కూడా ఈ సినిమాకు `బిల్లా-రంగా` టైటిల్‌నే సూచించినట్టు సమాచారం. సాగర్ కె.చంద్ర రూపొందించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతోంది. 

Updated Date - 2020-12-22T17:59:50+05:30 IST