పవన్‌కు ఆ సినిమా నచ్చలేదట!

ABN , First Publish Date - 2020-05-27T15:15:28+05:30 IST

రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి వెండితెర పునరాగమనం చేయబోతున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్

పవన్‌కు ఆ సినిమా నచ్చలేదట!

రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి వెండితెర పునరాగమనం చేయబోతున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రస్తుతం `వకీల్‌సాబ్` సినిమా చేస్తున్నారు. దీని తర్వాత డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించనున్నారు. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్‌కు కూడా ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. 


మలయాళ సినిమా `డ్రైవింగ్ లైసెన్స్` తెలుగు రీమేక్‌లో పవన్ నటించబోతున్నారని మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద నిర్మాత ఈ సినిమా తెలుగు హక్కులు తీసుకున్నారని, పవన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని తెలుస్తోంది. ఆ సినిమా చేయడానికి పవన్ ఆసక్తికరంగా లేరట. ఆ సినిమా తెలుగుకు సూట్ అవదని సన్నిహితుల వద్ద పవన్ వ్యాఖ్యానించారట. 

Updated Date - 2020-05-27T15:15:28+05:30 IST