పవన్ 29 ఓకే.. డైరెక్టర్ ఎవరంటే?
ABN , First Publish Date - 2020-08-14T19:03:52+05:30 IST
జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేస్తోన్న తొలి చిత్రం ‘వకీల్‌సాబ్’.

జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేస్తోన్న తొలి చిత్రం ‘వకీల్‌సాబ్’. దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో పవన్ నటించాల్సి ఉంది. ఇవి కాకుండా పవన్ మరిన్ని సినిమాల్లో నటిస్తారంటూ సోషల్‌మీడియాలో వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ చేయాల్సిన 28వ చిత్రాన్ని హరీశ్ శంకర్ డైరెక్ట్ చేయనున్నారు. కాగా.. ఇప్పుడు పవన్ తన 29వ సినిమాలో పవన్ నటించడానికి ఓకే చెప్పారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల మేరకు డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్‌కల్యాణ్ 29వ సినిమాను డైరెక్ట్ చేయనున్నారని, ఈ సినిమాను ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మిస్తారట. మరి ఈ వార్తలపై పవన్ క్యాంప్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.