రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్న ప‌రుశురామ్‌..?

ABN , First Publish Date - 2020-06-12T19:16:06+05:30 IST

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్న ప‌రుశురామ్‌..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా టైటిల్ లోగోను విడుద‌ల చేస్తూ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగ‌స్ట్ నుండి ప్రారంభం అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. క‌రోనా ప్ర‌భావంతో నిర్మాత‌లు చిత్ర వ్య‌యాన్ని త‌గ్గించే ప‌నిలో ప‌డ్డార‌ట‌. అందులో భాగంగా డైరెక్ట‌ర్ పరుశురామ్‌కు రెమ్యున‌రేష‌న్‌ను త‌గ్గించుకున్నాడు. గీత‌గోవిందం సినిమాకు రూ.9కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న ప‌రుశురామ్ ఈ సినిమాకు మాత్రం రూ.7కోట్ల‌ను మాత్రమే తీసుకుంటున్న‌ట్లు వార్తలు వినపడుతున్నాయి. మ‌రి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 

Updated Date - 2020-06-12T19:16:06+05:30 IST