సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హిందీలోకి ఎన్టీయార్ ఫ్లాప్ మూవీ?

ABN, First Publish Date - 2020-11-27T18:52:14+05:30

దక్షిణాది సినిమాలకు బాలీవుడ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాది సినిమాలకు బాలీవుడ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. దక్షిణాదిన విజయవంతమైన చిత్రాలను హిందీలోకి రీమేక్ చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. హిట్ చిత్రాలే కాదు.. ఫ్లాప్ చిత్రాలపై కూడా బాలీవుడ్ మేకర్లు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీయార్ `ఉసరవెల్లి` సినిమాను హిందీలోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. 


ఎన్టీయార్, తమన్నా హీరోహీరోయిన్లుగా సురేందర్ రెడ్డి రూపొందించిన `ఊసరవెల్లి` 2011లో విడుదలైంది. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత బెంగాలీలోకి అనువాదమై అక్కడా పరాజయాన్నే చవి చూసింది. ఇప్పుడు ఈ కథకు పలు మార్పులు చేసి హిందీలోకి రీమేక్ చేస్తున్నారట. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. టిప్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. మరి, అక్కడైనా విజయం సాధిస్తుందేమో చూడాలి. 

Updated Date - 2020-11-27T18:52:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!