కీర్తి సురేష్ ఈ చిత్రం కూడా ఓటీటీలోనేనా?

ABN , First Publish Date - 2020-05-27T04:17:18+05:30 IST

‘మహానటి’ కీర్తిసురేష్ నటించిన చిత్రాలకు ఇప్పుడు ఓటీటీలో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఆమె నటించిన ‘పెంగ్విన్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు జూన్ నెలలో

కీర్తి సురేష్ ఈ చిత్రం కూడా ఓటీటీలోనేనా?

‘మహానటి’ కీర్తిసురేష్ నటించిన చిత్రాలకు ఇప్పుడు ఓటీటీలో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఆమె నటించిన ‘పెంగ్విన్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు జూన్ నెలలో విడుదల చేయబోతున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు. ఇప్పుడు ఆ చిత్రదారిలోనే కీర్తిసురేష్ నటించిన మరో చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారానే విడుదల కాబోతోందంటూ వెబ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తిసురేష్ కీలకపాత్రలో నటించిన ‘మిస్ ఇండియా’ చిత్ర హక్కులను కూడా అమెజాన్ ప్రైమ్ వారే ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లుగా టాక్ నడుస్తుంది. 


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలకు డిజిటల్ రిలీజే సరైన మార్గం అని నిర్మాతలు భావిస్తున్నారు. ఎందుకంటే థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చినా.. థియేటర్స్ తెరుచుకునే విషయంలో ప్రభుత్వం ఇప్పుడప్పుడే అనుమతులు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ అనుమతులు ఇచ్చినా కరోనా వైరస్‌కు భయపడిన ప్రజలు థియేటర్స్‌కు వస్తారా? అనే ప్రశ్న కూడా ఇప్పుడు నిర్మాతలను ఆలోచింపజేస్తుంది. అందుకే కొందరు నిర్మాతలు డిజిటల్ బాట పడుతున్నారు. అయితే వెంటవెంటనే కీర్తిసురేష్ నటించిన రెండు సినిమాలు ఓటీటీలో విడుదలవ్వమే ఇక్కడ విశేషం. 

Updated Date - 2020-05-27T04:17:18+05:30 IST