‘ఆదిపురుష్’.. సీతగా మరో హీరోయిన్ పేరు
ABN , First Publish Date - 2020-08-25T03:42:58+05:30 IST
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఆయన క్రేజ్ అమాంతం

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం తన 20వ చిత్రం ‘రాధేశ్యామ్’ ఇంకా పూర్తి కాక ముందే మరో రెండు సినిమాలను ప్రభాస్ ప్రకటించారు. అందులో ఒకటి ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కాగా, రెండో చిత్రం ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘ఆదిపురుష్’. ఇటీవలే ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ప్రకటించారు. దీని విశేషాలు ఏమిటంటే.. బాలీవుడ్‌లో ప్రభాస్ చేస్తున్న స్ట్రయిట్ చిత్రమిది. మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఓంరౌత్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. అయితే ఆయన పక్కన సీతగా నటించే తార విషయంలో ఇప్పటికే రెండు పేర్లు వినిపించాయి.
ప్రభాస్ సరసన సీతగా ముందు ‘మహానటి’ కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఆ తర్వాత పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోయిన్ కావాలని చిత్రయూనిట్ భావిస్తుంది అనే వార్తలతో పాటు ప్రియాంకా చోప్రాని చిత్రయూనిట్ సంప్రదిస్తున్నట్లుగా టాక్ నడిచింది. కానీ ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఈ సినిమాలో సీతగా ప్రభాస్ సరసన నటించేందుకు కియారా అద్వానీని సంప్రదిస్తున్నారట. కియారా అద్వానీ అల్రెడీ సౌత్‌కి తెలిసిన హీరోయిన్ కావడంతో పాటు, ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. అందుకే ఆమె అయితే ప్రాజెక్ట్‌కి మంచి క్రేజ్ వస్తుందని చిత్రయూనిట్ భావిస్తున్నట్లుగా టాక్. అయితే ఊపిరి సలపనంత బిజీగా ఉన్న కియారా.. ఈ ప్రాజెక్ట్‌కి డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడాలి.
Read more