మ‌రోసారి చిరుతో త్రిష జోడీ..!

ABN , First Publish Date - 2020-05-13T15:46:33+05:30 IST

చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’లో త్రిష జోడీ క‌ట్టాల్సింది కానీ క్రియేటివ్ డిఫ‌రెన్స్‌లున్నాయంటూ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది.

మ‌రోసారి చిరుతో త్రిష జోడీ..!

చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’లో త్రిష జోడీ క‌ట్టాల్సింది కానీ క్రియేటివ్ డిఫ‌రెన్స్‌లున్నాయంటూ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. ఆ స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా చేస్తుంది. ఈ విష‌యాల‌ను ప‌ట్టించుకోకుండా చిరంజీవి మ‌రో సినిమాలో త్రిష‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్లే.. ‘ఆచార్య’ త‌ర్వాత చిరంజీవి ‘లూసిఫ‌ర్’ రీమేక్‌తో పాటు త‌మిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌లోనూ న‌టించ‌బోతున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఓ చిత్రంలో చిరుతో త్రిష జోడీ క‌ట్ట‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి సోష‌ల్ మీడియాలో వస్తున్న ఈ వార్త‌ల‌పై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 


Updated Date - 2020-05-13T15:46:33+05:30 IST