త్రివిక్రమ్ నిర్ణయంపై ఎన్టీయార్ అసంతృప్తి?

ABN , First Publish Date - 2020-05-04T21:14:09+05:30 IST

రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్` తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయాలనుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్.

త్రివిక్రమ్ నిర్ణయంపై ఎన్టీయార్ అసంతృప్తి?

రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్` తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయాలనుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్. వరుసగా యాక్షన్ సినిమాల్లోనే నటిస్తున్న ఎన్టీయార్.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. జులైతో `ఆర్ఆర్ఆర్` షూటింగ్ పూర్తి చేసుకుని ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నాడు. అయితే ఎన్టీయార్ ప్లాన్స్‌ను కరోనా తారుమారు చేసింది.


`ఆర్ఆర్ఆర్` షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు, ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. జనవరి వరకు ఈ సినిమాకు ఎన్టీయార్ డేట్లు కేటాయించాల్సిందేనని టాక్. ఈ గ్యాప్‌లో సీనియర్ హీరో వెంకటేష్‌తో సినిమా చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఈ నిర్ణయంపై ఎన్టీయార్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. `అల వైకుంఠపురములో..` తర్వాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాకు భారీ క్రేజ్ ఉంటుందని, అది తన సినిమాకు ప్లస్ అవుతుందని ఎన్టీయార్ అనుకుంటున్నాడట. వెంకీతో చేయబోయే సినిమా ఫలితం అటూఇటూ అయితే అది తన సినిమాకు మైనస్‌గా మారుతుందని భావిస్తున్నాడట. ఈ విషయంపై వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయట.  

Updated Date - 2020-05-04T21:14:09+05:30 IST