మెహర్‌కూ మెగాస్టార్ షాకిచ్చాడా?

ABN , First Publish Date - 2020-08-04T03:07:11+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌తో పాటు, మెహర్ రమేష్

మెహర్‌కూ మెగాస్టార్ షాకిచ్చాడా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌తో పాటు, మెహర్ రమేష్, బాబీ వంటి దర్శకులతో చిత్రాలు ఉంటాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవే స్వయంగా ప్రకటించారు. ఇందులో ‘లూసిఫర్’ రీమేక్ విషయమై ఇటీవల కొన్ని వార్తలు వినబడుతున్నాయి. ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ ఉంటుందని, సుజీత్ ఈ రీమేక్‌కు సంబంధించి తెలుగు నెటివిటీకి అంతా మార్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ విషయంలో చిరు వెనక్కి తగ్గారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు సుజీత్ కూడా వేరే ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లుగా తెలుస్తుంది.


ఇక చిరు చెప్పిన లిస్ట్‌లో ఉన్న మెహర్ రమేష్‌కు కూడా చిరు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఫస్ట్ మెహర్ చెప్పిన స్టోరీ లైన్ బాగుండటంతో.. ఫుల్ స్టోరీ డెవలప్ చేయమని చెప్పిన చిరు, ఇటీవల ఫుల్ స్టోరీ విన్న తర్వాత ఇది నాకు సూట్ అవ్వదని తేల్చేసినట్లుగా టాక్ నడుస్తుంది. అంటే మెహర్ రమేష్‌తో మెగాస్టార్ సినిమా ఉండకపోవచ్చు అనేది ఇప్పుడు వినిపిస్తున్న వార్తలలో సారాంశం. అసలైతే మెహర్‌తో సినిమా అని మెగాస్టార్ చెప్పినప్పుడే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ లేదనే వార్తలు బయటికి వస్తుండటంతో.. మెగా ఫ్యాన్స్ ఫీలింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా..!

Updated Date - 2020-08-04T03:07:11+05:30 IST