ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఈ భామేనా?

ABN , First Publish Date - 2020-08-17T05:00:24+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ 2 పార్ట్‌ల తర్వాత ‘సాహో’ చేశారు. ఈ చిత్రం సౌత్‌లో ఏమోగానీ.. నార్త్‌లో మాత్రం మంచి హిట్ అయింది. ప్రభాస్ రేంజ్ బాలీవుడ్‌లో

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఈ భామేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ 2 పార్ట్‌ల తర్వాత ‘సాహో’ చేశారు. ఈ చిత్రం సౌత్‌లో ఏమోగానీ.. నార్త్‌లో మాత్రం మంచి హిట్ అయింది. ప్రభాస్ రేంజ్ బాలీవుడ్‌లో ఎలా ఉందో తెలియజేసింది. ఇక ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో.. ఆయన చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పాన్ ఇండియాను దాటి.. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రభాస్ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం పూర్తవగానే.. నాగ్ అశ్విన్‌తో చిత్రానికి ప్రభాస్ రెడీ అవుతారు.


ఇక పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కబోయే తారాగణం విషయంలో నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపికాను ప్రభాస్ సరసన సెట్ చేశాడు. ఇంకా ఇతర తారాగణం కూడా హై రేంజ్‌లో ఉండబోతున్నారని టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌కు కూడా ఛాన్స్ ఉందని ఈ మధ్య వార్తలు వినిపించాయి. ఈ పాత్రకు కొందరు హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఈ పాత్రల్లో నివేతా థామస్‌ను నటింపజేయాలని నాగ్ అశ్విన్ అనుకుంటున్నట్లుగా ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినవస్తున్నాయి. అయితే ఆమె టాలెంట్ ఉన్న హీరోయిన్ అయినప్పటికీ హైట్ దృష్ట్యా ప్రభాస్‌కు అస్సలు సెట్ కాదనేది అభిమానుల మాట. మరి ఈ విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. Updated Date - 2020-08-17T05:00:24+05:30 IST