నితిన్ పెళ్లి తేది ఖ‌రారు..!

ABN , First Publish Date - 2020-07-01T14:20:18+05:30 IST

హీరో నితిన్ పెళ్లి తేది ఖ‌రారైంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి.

నితిన్ పెళ్లి తేది ఖ‌రారు..!

హీరో నితిన్ పెళ్లి తేది ఖ‌రారైంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. నిజానికి క‌థానాయ‌కుడు నితిన్, త‌న ప్రేయ‌సి షాలిని కందుకూరి పెళ్లి ఏప్రిల్ 16నే జరగాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో పెళ్లిని వాయిదా వేశారు. ఆ త‌ర్వాత వీరి పెళ్లి డిసెంబ‌ర్‌లో జ‌రుగుతుంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే తాజాగా ఇరు కుటుంబాల పెద్ద‌లు నితిన్‌, షాలినిల పెళ్లిని జూలై 26న నిర్వ‌హించ‌డానికి నిర్ణ‌యించుకున్నార‌ని టాక్‌. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతంలోని ఫామ్ హౌస్‌లో ప్ర‌భుత్వ లాక్‌డౌన్ నిబంధ‌న‌ల మేర‌కు వీరి పెళ్లి జ‌రుగుతుంద‌ని అంటున్నారు. 

Updated Date - 2020-07-01T14:20:18+05:30 IST