నితిన్ స‌ర‌స‌న న‌భా న‌టేశ్‌..?

ABN , First Publish Date - 2020-06-12T14:28:27+05:30 IST

ఈ ఏడాది ‘భీష్మ‌’తో స‌క్సెస్ కొట్టిన యువ క‌థానాయ‌కుడు నితిన్ వ‌రుస సినిమాలు చేయ‌డానికి రెఢీ అవుతున్నారు.

నితిన్ స‌ర‌స‌న న‌భా న‌టేశ్‌..?

ఈ ఏడాది ‘భీష్మ‌’తో స‌క్సెస్ కొట్టిన యువ క‌థానాయ‌కుడు నితిన్ వ‌రుస సినిమాలు చేయ‌డానికి రెఢీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న బాలీవుడ్ చిత్రం అందాదున్‌ను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహ‌న్ న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు ఈ లిస్టులో మ‌రో హీరోయిన్ కూడా చేరింద‌ట‌. ‘న‌న్ను దోచుకుందువ‌టే’, ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’, ‘డిస్కోరాజా’ చిత్రాల క‌థానాయిక న‌భాన‌టేశ్ పేరుని హీరోయిన్‌గా ప‌రిశీలిస్తున్నార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ రీమేక్‌లో నటించబోయే హీరోయిన్ ఎవరనే విష‌యంపై క్లారిటీ రానుంది. 

Updated Date - 2020-06-12T14:28:27+05:30 IST