ఇలా అయితే నితిన్ ‘అంధాధున్’ రీమేక్ కష్టమే..

ABN , First Publish Date - 2020-05-26T04:27:43+05:30 IST

కరోనా ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో దాదాపు ప్రపంచ దేశాలన్ని ఇప్పటికే చవిచూశాయి. పాజిటివ్, మరణాలు సంగతి పక్కన పెడితే దాని కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ

ఇలా అయితే నితిన్ ‘అంధాధున్’ రీమేక్ కష్టమే..

కరోనా ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో దాదాపు ప్రపంచ దేశాలన్ని ఇప్పటికే చవిచూశాయి. పాజిటివ్, మరణాలు సంగతి పక్కన పెడితే దాని కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ ఏ రేంజ్‌లో దెబ్బతిందో కూడా రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీపై ఈ ప్రభావం ఇప్పటి వరకు ఒక కోణంలోనే పడింది. ఇప్పుడు రెండో కోణంలో పడబోతోంది. షూటింగ్స్ లేక అందరూ ఇళ్లకే పరిమితం అయినది మొదటి కోణం అయితే.. రెండో కోణం ఇప్పుడు మొదలు కాబోతోంది. షూటింగ్స్‌లో కూడా అతి తక్కువ మంది పాల్గొనాలి. ప్రభుత్వం ఇచ్చిన షరతులకు అనుగుణంగా షూటింగ్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఓకే.. ఇప్పుడు హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్, లిప్‌లాక్స్ సంగతే పెద్ద సమస్య కాబోతోంది. ఇప్పటికే హీరోయిన్లు ఇటువంటివి ఉంటే చేయమని చెబుతున్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 


కొందరు హీరోయిన్లు డైరెక్ట్‌గానే చెప్పేస్తున్నారట. రొమాన్స్, లిప్‌లాక్ వంటివి చేయాలంటే మేము చేయమంటూ అవకాశాలు వదులుకుంటున్నారట. ఇప్పుడీ ఎఫెక్ట్ నితిన్ చేయాలనుకుంటున్న సినిమాపై భారీగా ప్రభావం చూపుతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ‘అంధాదున్’ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఇంటెన్స్ సీన్లు ఎక్కువగా ఉండటంతో.. ఏ హీరోయిన్‌ కూడా ఇందులో నటించేందుకు ముందుకు రావడం లేదంట. ఇప్పటికే దర్శకుడు ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లను సంప్రదించాడట. కానీ అందరూ భయపడిపోతున్నారట. ఇలా అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం కష్టమే అంటూ టాలీవుడ్ సర్కిల్‌లో గుసగుసలాడుతున్నారు. 

Updated Date - 2020-05-26T04:27:43+05:30 IST