జూలైలో నితిన్ పెళ్లి?

ABN , First Publish Date - 2020-06-28T03:21:08+05:30 IST

ఈ ఏడాది పెళ్లి పీటలెక్కుదామనుకున్న చాలా మందికి కరోనా అడ్డుపడింది

జూలైలో నితిన్ పెళ్లి?

ఈ ఏడాది పెళ్లి పీటలెక్కుదామనుకున్న చాలా మందికి కరోనా అడ్డుపడింది. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా పెళ్లిళ్లు వాయిదాలు వేసుకున్నారు. అయితే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మాత్రం లాక్‌డౌన్ సమయంలోనే తక్కువ మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసేసుకున్నాడు. ఆ తర్వాత మరికొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అదే బాట పట్టారు. 


యంగ్ హీరో నితిన్ కూడా త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడట. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, షాలిని ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో వీరి పెళ్లి నిరాడంబరంగా జరగబోతోందట. ఇరు కుటుంబాల సన్నిహితులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరుకాబోతున్నారట. 


Updated Date - 2020-06-28T03:21:08+05:30 IST