'నిశ్శబ్దం' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారైందా..?

ABN , First Publish Date - 2020-09-16T14:45:38+05:30 IST

అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. మాధవన్‌, షాలినిపాండే, అంజలి, సుబ్బరాజు, అండ్రూ హడ్సన్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

'నిశ్శబ్దం' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారైందా..?

అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. మాధవన్‌, షాలినిపాండే, అంజలి, సుబ్బరాజు, అండ్రూ హడ్సన్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. క్రాస్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సింది. కానీ.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడతాయి. థియేటర్స్ ఓపెన్‌ అవుతాయని అనుకున్న యూనిట్‌కు ఆ విషయంలో నిరాశే కలిగింది. ఎందుకంటే థియేటర్స్‌ ఎప్పుడు ఓపెన్‌ అవుతాయనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేల ఓపెన్‌ అయినా ప్రేక్షకులు భారీ రేంజ్‌లో థియేటర్స్‌కు వస్తారా? అనే సందేహాలు మేకర్స్‌లో, థియేటర్స్‌ యాజమాన్యాల మదిలో మొదులుతున్న సందేహం. దీంతో 'నిశ్శబ్దం' సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అయిపోయారట. డీల్‌ పూర్తయ్యిందట. అక్టోబర్ 2న 'నిశ్శబ్దం' ను అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే 'నిశ్శబ్దం' ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. 


Updated Date - 2020-09-16T14:45:38+05:30 IST