ఓటీటీలో ‘నిశ్శ‌బ్దం’ ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2020-08-19T13:48:18+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లో హేమంత్ మ‌ధుక‌ర్ తెర‌కెక్కించిన క్రాస్ జోన‌ర్ చిత్రం ‘నిశ్శ‌బ్దం’. కోన వెంకట్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతలు.

ఓటీటీలో ‘నిశ్శ‌బ్దం’ ఎప్పుడంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లో హేమంత్ మ‌ధుక‌ర్ తెర‌కెక్కించిన క్రాస్ జోన‌ర్ చిత్రం ‘నిశ్శ‌బ్దం’. కోన వెంకట్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతలు. ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆగింది. థియేట‌ర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. దీంతో ‘నిశ్శ‌బ్దం’ విడుద‌ల‌పై నిర్మాత‌ల‌కు ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ‘నిశ్శ‌బ్దం’ చిత్రాన్ని విడుద‌ల చేయున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే డీల్ పూర్త‌య్యింద‌ని, సెప్టెంబ‌ర్‌లోనే ‘నిశ్శ‌బ్దం’ ఓటీటీ విడుద‌ల ఉండ‌వ‌చ్చున‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Updated Date - 2020-08-19T13:48:18+05:30 IST