నిఖిల్ సినిమా లాంఛ్‌లోనే టైటిల్ ప్రకటన

ABN , First Publish Date - 2020-03-04T22:44:10+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ కొత్త సినిమాను గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు. అనంతరం ఈ సినిమా టైటిల్‌ను ..

నిఖిల్ సినిమా లాంఛ్‌లోనే టైటిల్ ప్రకటన

యంగ్ హీరో నిఖిల్ కొత్త సినిమాను గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు. అనంతరం ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ కథ- స్క్రీన్ ప్లే అందించనున్నారు. దర్శకుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించనున్నారు. గీతా ఆర్ట్స్ -2 ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. దర్శకుడు సూర్యప్రతాప్ గతంలో ‘కుమారి21ఎఫ్’ను తెరకెక్కించారు. ఈ చిత్రానికి కూడా దర్శకుడు సుకుమార్ కథ అందించారు. ఇప్పుడు సుకుమార్ -సూర్యప్రతాప్ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర నటి నటులను కూడా త్వరలో ప్రకటించనున్నారు. 

Updated Date - 2020-03-04T22:44:10+05:30 IST

Read more