సంక్రాంతి బరిలో ఆ ఇద్దరు హీరోలేనా?

ABN , First Publish Date - 2020-08-25T21:20:22+05:30 IST

తెలుగు నాట సినిమాలకు సంక్రాంతిని మించిన సీజన్ లేదు.

సంక్రాంతి బరిలో ఆ ఇద్దరు హీరోలేనా?

తెలుగు నాట సినిమాలకు సంక్రాంతిని మించిన సీజన్ లేదు. ఆ సమయంలో మూడు, నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలైనా కలెక్షన్లకు ఢోకా ఉండదని నిర్మాతలు భావిస్తుంటారు. సంక్రాంతి టార్గెట్‌గా సినిమాలు సిద్ధం చేస్తుంటారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. సంక్రాంతి పోటీలో భారీ సినిమాలేవి నిలిచేలా కనబడడం లేదు. 


స్టార్ హీరోలు ఇప్పట్లో షూటింగ్‌లకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే ఇప్పటికే సిద్ధమైన సినిమాలు ఓటీటీల బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు యంగ్ హీరోలు మాత్రమే వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో హీరో రామ్ నటించిన `రెడ్` సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. మరో యంగ్ హీరో నితిన్ `రంగ్ దే` కూడా సంక్రాంతికి సిద్ధమైపోతుందట. ఇప్పటికే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలే పక్కాగా కనిపిస్తున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే అక్కినేని అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` కూడా సంక్రాంతికి సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2020-08-25T21:20:22+05:30 IST