`వకీల్ సాబ్` రిలీజ్ డేట్ ఫిక్స్?
ABN , First Publish Date - 2020-12-30T16:26:26+05:30 IST
ఈ ఏడాదే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ను వెండితెర మీద చూడాలనుకున్న అభిమానుల ఆశలపై కరోనా నీళ్లు జల్లింది.

ఈ ఏడాదే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ను వెండితెర మీద చూడాలనుకున్న అభిమానుల ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న `వకీల్ సాబ్` సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది.
బుధవారమే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగు పెట్టింది. తాజా సమాచారం ప్రకారం `వకీల్ సాబ్` సినిమాను వేసవి సందర్భంగా ఏప్రిల్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. సంక్రాంతికి `వకీల్ సాబ్` టీజర్‌ను విడుదల చేస్తారట. ఆ టీజర్‌తో పాటే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారట.