ఎన్టీయార్-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు?

ABN , First Publish Date - 2020-11-17T17:23:06+05:30 IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే.

ఎన్టీయార్-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు?

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. హారికా హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి `అయిననూ పోయి రావలె హస్తినకు` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. 


అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికి ఈ సినిమా షూటింగ్ సగం పూర్తి కావాల్సింది. అయితే `ఆర్ఆర్ఆర్` ఆలస్యం, ఆపై లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. తాజా సమాచారం ప్రకారం `ఆర్ఆర్ఆర్`లో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఫిబ్రవరికి పూర్తవుతుందట. ఆ తర్వాత మార్చి నుంచి త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించాలని ఎన్టీయార్ అనుకుంటున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామను తీసుకోబోతున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-11-17T17:23:06+05:30 IST