చిరు-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు?

ABN , First Publish Date - 2020-06-08T21:48:56+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

చిరు-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా తర్వాత మలయాళ `లూసిఫర్` రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. 


`సాహో` డైరెక్టర్ సుజిత్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా `లూసిఫర్` కథలో సుజిత్ మార్పులు చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మెగాస్టార్ సినిమా ఉంటుందని సమాచారం. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీయార్ సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఎన్టీయార్ `ఆర్ఆర్ఆర్`తో బిజీగా ఉండడంతో త్రివిక్రమ్ సినిమా ఈ ఏడాది పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. `ఆర్ఆర్ఆర్` నుంచి ఎన్టీయార్ రిలీవ్ అయిన తర్వాత తన సినిమాను త్రివిక్రమ్ ప్రారంభిస్తారు. ఆ సినిమా విడుదలయ్యే సమయానికి చిరంజీవి`ఆచార్య`, `లూసిఫర్` రీమేక్ పూర్తి చేస్తారట. 

Updated Date - 2020-06-08T21:48:56+05:30 IST