చిన్ననాటి స్నేహితురాలితో శర్వా పెళ్లి?
ABN , First Publish Date - 2020-08-25T17:34:33+05:30 IST
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా? తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ కరోనా సమయంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు యంగ్ హీరోలు వివాహాలు చేసుకున్నారు. శర్వా కూడా అదే బాటలో నడవబోతున్నాడట.
తన చిన్ననాటి స్నేహితురాలైన ఓ యువ పారిశ్రామికవేత్తతో శర్వా కొద్ది కాలంగా ప్రేమయాణం సాగిస్తున్నాడట. వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకారం తెలిపారట. త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే శర్వా స్పందించాల్సిందే.
Read more