పవన్ కొత్త లుక్ అందుకేనా?
ABN , First Publish Date - 2020-07-27T19:09:18+05:30 IST
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న `వకీల్ సాబ్`, డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమాలు ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్నాయి. `వకీల్ సాబ్` షూటింగ్ చాలా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది.
ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు లభించిన తర్వాత `వకీల్ సాబ్`ను పట్టాలెక్కించాలని నిర్మాత భావిస్తున్నారు. ఇక, పవన్ ఇటీవల పూర్తిగా గెడ్డం, జుత్తు పెంచి కొత్త లుక్‌లోకి మారిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ క్రిష్ సినిమా కోసమే పవన్ ఇలా జుత్తు పెంచారట. ఆ సినిమాలో పవన్ కొన్ని కొత్త గెటప్‌లలో కనిపించనున్నారట. అలాగే సన్నబడడం కోసం పవన్ డైటింగ్ కూడా చేస్తున్నారట.