`బంగార్రాజు` సెట్స్ పైకి వస్తున్నాడా?

ABN , First Publish Date - 2020-12-01T18:13:59+05:30 IST

`కింగ్` నాగార్జున నటించిన `సోగ్గాడే చిన్ని నాయనా` చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

`బంగార్రాజు` సెట్స్ పైకి వస్తున్నాడా?

`కింగ్` నాగార్జున నటించిన `సోగ్గాడే చిన్ని నాయనా` చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమాలోని బంగార్రాజు క్యారెక్టర్‌ను ప్రధానంగా చేసుకుని అదే టైటిల్‌తో ఓ సినిమా చేయాలని నాగ్ భావించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. 


నిజానికి `మన్మథుడు-2` పూర్తయిన వెంటనే `బంగార్రాజు`ను ప్రారంభించాలనుకున్నారు. అయితే `మన్మథుడు-2` ఫలితంతో నిరాశ చెందిన నాగార్జున `బంగార్రాజు`ను పక్కనపెట్టారు. కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని `వైల్డ్ డాగ్`ను ప్రారంభించారు. ఆ సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తయింది. ఇక ఇప్పుడు `బంగార్రాజు`పై నాగ్ దృష్టి సారించారట. కల్యాణ్ కృష్ణ ఇటీవలె నాగ్‌కు పూర్తి స్క్రిప్టు వినిపంచాడట. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోందట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడబోతున్నట్టు సమాచారం. 


  

Updated Date - 2020-12-01T18:13:59+05:30 IST

Read more