కీర్తిపై పెళ్లి ఒత్తిడి?

ABN , First Publish Date - 2020-12-30T14:54:56+05:30 IST

`మ‌హాన‌టి`తో జాతీయ స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించింది హీరోయిన్ కీర్తి సురేష్.

కీర్తిపై పెళ్లి ఒత్తిడి?

`మ‌హాన‌టి`తో జాతీయ స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించింది హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. లాక్‌డౌన్ సమయంలో చాలా మంది సినీ ప్రముఖులు వివాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే. కీర్తికి కూడా ఈ ఏడాది పెళ్లి చేసెయ్యాలని ఆమె పేరెంట్స్ భావించారట. 


ప్రస్తుతం కీర్తి వయసు 28 సంవత్సరాలు. దీంతో పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేశారట. అయితే కీర్తి మాత్రం ఇప్పట్లో పెళ్లి వద్దని చెప్పేసిందట. ప్రస్తుతం అవకాశాలు భారీగా వస్తున్నాయి కాబట్టి కెరీర్‌పైనే దృష్టి పెట్టాలని ఫిక్స్ అయిందట. కీర్తి ప్ర‌స్తుతం నితిన్ `రంగ్ దే`లోనూ, మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌`లోనూ నటిస్తోంది. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సరసన కూడా మరోసారి కనిపించబోతోందట. 

Updated Date - 2020-12-30T14:54:56+05:30 IST