ఎన్‌బీకే 106.. మ‌రో టైటిల్‌?

ABN , First Publish Date - 2020-08-19T17:40:41+05:30 IST

నటసింహ నందమూరి బాలకృష్ణ 106వ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఎన్‌బీకే 106.. మ‌రో టైటిల్‌?

నటసింహ నందమూరి బాలకృష్ణ 106వ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్ ప‌రిస్థితులు సెట్ అయ్యాక సెట్స్‌పైకి వెళ్ల‌డానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా టైటిల్ ఏంట‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ... సోష‌ల్ మీడియాలో మాత్రం మోనార్క్‌, మొన‌గాడు వంటి టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. తాజాగా ఈ లిస్టులో మ‌రో టైటిల్ కూడా చేరింది. బొనాంజ అనే టైటిల్‌ను కూడా ప‌రిశీలిస్తున్నార‌ని టాక్. మ‌రి చివ‌ర‌కు బోయ‌పాటి ఏ టైటిల్‌ను పెడ‌తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. 

Updated Date - 2020-08-19T17:40:41+05:30 IST