అఖిల్ సినిమాలో మరో హీరోయిన్‌..!

ABN , First Publish Date - 2020-12-02T17:42:44+05:30 IST

అఖిల్‌ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా లేటెస్ట్‌ సమాచారం మేరకు మరో హీరోయిన్‌ కూడా ఈ సినిమాలో నటిస్తుంది.

అఖిల్ సినిమాలో మరో హీరోయిన్‌..!

అఖిల్‌ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏపిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా లేటెస్ట్‌ సమాచారం మేరకు మరో హీరోయిన్‌ కూడా ఈ సినిమాలో నటిస్తుంది. ఆమె ఎవరో కాదు..నేహా శెట్టి. ఇంతకు ముందు ఈ అమ్మడు పూరీ జగన్నాథ్‌ దర్శక నిర్మాణంలో ఆకాశ్‌ పూరి హీరోగా చేసిన 'మెహబూబా' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు 'మోస్ట్‌ఎలిజిబుల్‌బ్యాచ్‌లర్‌'లో నేహా శెట్టి సెకండ్ హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-02T17:42:44+05:30 IST