ఆ రీమేక్‌లో చేయడానికి నయన్ రూ. 4 కోట్లు డిమాండ్

ABN , First Publish Date - 2020-08-07T04:48:03+05:30 IST

లేడీ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న నయనతార కాస్త స్పీడ్ తగ్గించినట్లుగా కనబడుతోంది. మరి అందరినీ కలుపుకుని వెళ్లాలని భావిస్తుందో.. లేక కాబోయే వాడు

ఆ రీమేక్‌లో చేయడానికి నయన్ రూ. 4 కోట్లు డిమాండ్

లేడీ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న నయనతార కాస్త స్పీడ్ తగ్గించినట్లుగా కనబడుతోంది. మరి అందరినీ కలుపుకుని వెళ్లాలని భావిస్తుందో.. లేక కాబోయే వాడు కారణమో తెలియదు కానీ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలే కాకుండా ఇప్పుడు కోలీవుడ్‌ హీరోలతో జత కట్టేందుకు కూడా నయన్ రెడీ అంటోంది. అయితే తెలుగు సినిమాల విషయంలో మాత్రం ఆమె ఇంకా తన పంథా మార్చుకోలేదు. తాజాగా నితిన్ సినిమాలో నటించడానికి ఆమె భారీగా డిమాండ్ చేసిందనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌ని షేక్ చేస్తున్నాయి.


విషయంలోకి వస్తే.. నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాధున్ రీమేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టబు పోషించిన పాత్ర కోసం ఎవ్వరూ సెట్ అవ్వడం లేదు. నితిన్ సొంత బ్యానర్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో స్టార్ నటీనటులనే తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒరిజినల్‌లో చేసిన టబునే ముందు సంప్రదించగా.. ఆమె బిజీగా ఉండటం వల్ల నో చెప్పేసింది. ఆ తర్వాత ఈ పాత్ర కోసం ఇద్దరు ముగ్గురిని అనుకున్న టీమ్.. చివరికి నయనతారను తీసుకోవాలని ఫిక్సై, ఆమెను సంప్రదించగా.. ఈ రీమేక్‌లో చేసేందుకు ఆమె అక్షరాలా రూ. 4 కోట్లు డిమాండ్ చేసిందని అంటున్నారు. మరి నయన్ విషయంలో చిత్రయూనిట్ ఎటువంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-08-07T04:48:03+05:30 IST