`చెన్నై ఎక్స్‌ప్రెస్`ను నయన్ అందుకే వదులుకుందా?

ABN , First Publish Date - 2020-07-16T00:52:30+05:30 IST

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌తో పనిచేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

`చెన్నై ఎక్స్‌ప్రెస్`ను నయన్ అందుకే వదులుకుందా?

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌తో పనిచేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. అయితే దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార మాత్రం షారూక్ ఆఫర్‌ను తిరస్కరించిందట. `చెన్నై ఎక్స్‌ప్రెస్` సినిమాలో మెరిసే అవకాశాన్ని వదులుకుందట. 


దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటూ లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన నయన్ చేత `చెన్నై ఎక్స్‌ప్రెస్`లో ఓ ప్రత్యేక గీతం చేయించాలని షారూక్ ప్లాన్ చేశారట. నయన్‌ను కలిసి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. అయితే ఆ పాట చేసేందుకు నయన్ అంగీకరించలేదట. తన మాజీ ప్రేమికుడు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తుండడం వల్లే ఆ పాటను నయన్ తిరస్కరించిందట. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2020-07-16T00:52:30+05:30 IST