బాలయ్య సినిమాలో నవీన్ చంద్ర..?

ABN , First Publish Date - 2020-06-16T18:02:38+05:30 IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

బాలయ్య సినిమాలో నవీన్ చంద్ర..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో వినపడుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో హీరో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడట. ఇది వరకు నందమూరి హీరో తారక్ హీరోగా నటించిన ‘అరవిద సమేత’ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నారని టాక్ వినపడుతుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 

Updated Date - 2020-06-16T18:02:38+05:30 IST