ఇద్ద‌రు హీరోయిన్స్‌తో నాని

ABN , First Publish Date - 2020-02-27T18:37:34+05:30 IST

ఆ మధ్యంతా పక్కింటి అబ్బాయి తరహా పాత్రలకే పరిమితమైన నాని... ఇప్పుడిప్పుడే విభిన్న భూమికల వైపు మొగ్గు చూపిస్తున్నాడు.

ఇద్ద‌రు హీరోయిన్స్‌తో నాని

ఆ మధ్యంతా పక్కింటి అబ్బాయి తరహా పాత్రలకే పరిమితమైన నాని... ఇప్పుడిప్పుడే విభిన్న భూమికల వైపు మొగ్గు చూపిస్తున్నాడు. ఈ పరంపరలో భాగంగానే... త్వరలో 'వి'లో ప్రతినాయకుడిగా సందడి చేయనున్నాడు. అలాగే ఏడాది చివరలో 'శ్యామ్ సింగ రాయ్' అనే సైంటిఫిక్ ఫిక్షన్ తో పలకరించ బోతున్నాడు. 'టాక్సీ వాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో నానికి జోడీగా సాయిపల్లవి, రశ్మిక ఎంపికయ్యారని సమాచారం. అదే గనుక నిజమైతే... 'ఎంసీఏ' తరువాత సాయిపల్లవితో, 'దేవదాస్' అనంతరం రశ్మికతో నాని నటించే చిత్రం ఇదే అవుతుంది. 


Updated Date - 2020-02-27T18:37:34+05:30 IST