ఓటీటీలో నాని ‘వి’.. విడుద‌ల ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2020-08-14T14:23:32+05:30 IST

నేచుర‌ల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌కుడు. సుధీర్‌భాబు, అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు.

ఓటీటీలో నాని ‘వి’.. విడుద‌ల ఎప్పుడంటే..?

నేచుర‌ల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌కుడు. సుధీర్‌భాబు, అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు. శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లు. నిజానికి ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా ప్ర‌భావంతో ఆగింది. థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోవ‌డంతో ఈ సినిమా విడుద‌ల‌పై ఇంకా క్లారిటీ రాలేదు. చాలా వ‌ర‌కు ఓ మోస్త‌రు చిత్రాలు ఓటీటీలో విడుద‌ల‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో నాని వి‘’ కోసం ఓటీటీ నుండి భారీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ప్రారంభంలోనే ఈ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ నో చెప్పిన దిల్‌రాజు ఎట్ట‌కేల‌కు ఓకే చెప్పార‌ని, ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థ‌తో డీల్ కుదిరింద‌ని స‌మాచారం. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సెప్టెంబ‌ర్‌లో ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుద‌ల‌వుతుంది. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. 

Updated Date - 2020-08-14T14:23:32+05:30 IST