కాంబినేషన్ కుదురుతోందా?
ABN , First Publish Date - 2020-10-12T17:22:29+05:30 IST
`శివమణి`, `సూపర్` వంటి చిత్రాలతో సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు `కింగ్` నాగార్జున, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

`శివమణి`, `సూపర్` వంటి చిత్రాలతో సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు `కింగ్` నాగార్జున, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. `సూపర్` తర్వాత వీరిద్దరూ ఇప్పటివరకు కలిసి పని చేయలేదు. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో మూడో సినిమాకు రంగం సిద్ధమవుతోందట. వీరి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలకు భిన్నంగా ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.
నాగ్ ప్రస్తుతం `వైల్డ్ డాగ్` సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అది అయిపోగానే దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమాను పట్టాలెక్కిస్తారు. దాని తర్వాత పూరీ సినిమా ఉంటుందని సమాచారం. పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా `ఫైటర్` సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
Read more