బయటకి వచ్చిన నాగార్జున?

ABN , First Publish Date - 2020-07-28T16:38:19+05:30 IST

కరోనా కారణంగా సినీ ప్రముఖులందరూ మార్చి నెల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు

బయటకి వచ్చిన నాగార్జున?

కరోనా కారణంగా సినీ ప్రముఖులందరూ మార్చి నెల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా షూటింగ్‌లను పూర్తి స్థాయిలో పక్కన పెట్టేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన తర్వాత కూడా పెద్ద హీరోలెవరూ షూటింగ్‌లు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరో నాగార్జున తాజాగా షూటింగ్ స్పాట్‌కు వచ్చారట. అయితే అది సినిమా కోసం కాదు.. ప్రముఖ రియాలిటీ షో `బిగ్‌బాస్` కోసం. 


ఆగస్టు రెండో వారం నుంచి `బిగ్‌బాస్-4` కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమం ప్రోమో షూటింగ్‌కు నాగార్జున హాజరయ్యారట. దాదాపు ఐదు నెలల తర్వాత మేకప్ వేసుకున్నారట. తక్కువ మంది సిబ్బందితో అన్నపూర్ణ స్టూడియాలో ఈ ప్రోమో షూటింగ్ జరిగిందట. `బిగ్‌బాస్-4` కార్యక్రమం కోసం నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. హోస్ట్ నాగార్జున సేఫ్టీ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించనున్నారట. 


Updated Date - 2020-07-28T16:38:19+05:30 IST